03-12-2020 23:02:14 About Us Contact Us



మెట్రో క్రియేషన్స్ బ్యానర్ పై అమీర్ సమర్పణలో భాను చందర్ ప్రధానపాత్రలో జంగాల నాగబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వదలను. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయిన ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కావాల్సింది కానీ ప్రస్తుతం ఉన్న కరోన కారణంగా థియేటర్స్ మూత పడ్డాయి, అందువల్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


వేసవి లో విడుదల చేసేందుకు ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్న సమయంలో కరోనా రావడంతో జాప్యం జరిగింది.ఒక పక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంటుంటే.. మరో పక్క సినిమా హాల్స్ తెరుచుకోవడం లేదు.ఇంతలో ఓటిటి లలో పలు సినిమాలు విడుదల చెయ్యడం చూసి ఓటిటి లలో విడుదల చెయ్యాలని చిత్ర బృందం భావించింది.ఇంతలో సినిమా రష్ చూసి ఒక ఓటిటి సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది. త్వరలో ఆ వివరాలు చిత్ర యూనిట్ తెలుపనున్నారు.


హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా . జీవ, వేణు గోపాల్, కవిత, అదిరే అభి, జబర్దస్త్ ఫణి, రఘు, రేణుక వంటి భారీ తారాగణం తో సినిమాను మెట్రో క్రియేషన్స్ బ్యానర్ పై మహమ్మద్ ఖలీల్ నిర్మించారు.వాసిరెడ్డి సత్యానంద్ సినిమాత్తోగ్రఫీ చెయ్యగా సంతోష్ రెడ్డి సంగీతం అందించారు.మహేంద్రనాథ్ ఈ సినిమాను ఎడిట్ చేశారు.


సినిమా ఏ ప్లేట్ ఫోరమ్ లో ఎప్పుడు విడుదలైనా భారీ విజయం సాధిస్తుంది అని చిత్ర బృందం గెట్టిగా నమ్ముతుంది అని దర్శకులు నాగబాబు గారు ఈ సందర్భంగా తెలిపారు.