24-01-2022 16:52:26 About Us Contact Usచూడు ఒక్క వైపే చూడు..రెండో వైపు చూడాలి అనుకోకు..తట్టుకోలేవు..మాడిపోతావ్..అంటూ నటసింహం “నందమూరి బాలకృష్ణ” నటవిశ్వరూపం..బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య స్టామినా చూపిన “సింహ” సినిమా వచ్చి నేటికి దశాబ్దం..భద్ర,తులసి వంటి మాస్ సినిమాలు చేసిన దర్శకుడు బోయపాటి మూడవ సినిమా ఏకంగా మాస్ కి అల్ టైం ఫేవరేట్ బాలకృష్ణ తో చెయ్యగా..అది తెలుగు నాట కొత్త చరిత్ర సృష్టించింది..నయనతార,స్నేహ ఉల్లాల్,నమితలతో చక్రి బాణీలు బాలయ్య ఆడుతుంటే అది చూసిన ప్రతి సినీ అభిమాని కేరింతలు కొట్టాడు..బోయపాటి రాసిన డైలాగ్స్ ను బాలయ్య నోట వస్తుంటే..సినిమా తీయటర్లు అన్ని దద్దరిల్లాయి..బాలకృష్ణ సినిమాలు వరసగా పోతుంటే బాధ పడ్డ అభిమానులకు అవే తియేటర్ల ముందు కాలర్ ఎగరేసిన రోజుకి నేడు దశాబ్దం..


నందమూరి బాలకృష్ణ కు సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ చూసి 10ఏళ్ళు గడిచిన సందర్భంగా సామాజిక మాద్యమాలలో అభిమానులు సంరలు జరుపుకుంటున్నారు..లాక్ డౌన్ లేకుంటే కచ్చితంగా జిల్లాకు కొన్ని తీయటర్లలోనైనా ఆ సినిమాను మళ్ళీ ఒక రోజు ఆట వేసుకొని మరోసారి ఆ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చే వారు..కానీ ఇప్పుడు అది కుదరకపోవడంతో ఇలా సామాజిక మాధ్యమంలో జరుపుకుంటున్నారు.. పోస్టర్ లలో బాలకృష్ణ లుక్స్ తోనే సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి..తర్వాత వచ్చిన పాటలు సరే సారి..ఆ పాటలు ఆ సంవత్సరం అంతా విన్నారు అందరూ..


మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన బోయపాటి శ్రీను,మాస్ కా బాప్ బాలకృష్ణ కాంబినేషన్,అప్పటికే అడిరిపోయిన లుక్స్,పాటలు..ఇలా అన్ని కలిపి సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి..వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉంది సినిమా..సినిమా ఆరంభంలోనే ఎంత మాస్ సినిమా అనే విషయం అర్ధమవుతుంది..ఫ్లాష్ బ్యాక్ మొదలు దగ్గర నుండి సినిమా రికార్డులు ఖాయం అని అర్ధమవుతుంది..ఒక్కో డైలాగ్ బాలయ్య నోట తూటాలా పేలింది..దింతో బాక్స్ ఆఫీస్ సేన్ సెషన్ అయింది..


“వద్దు ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడాడు ఎస్.పి.చరిత్ర అంటే మాది..చరిత్ర సృష్టించాలన్నా మేమే..దాన్ని తిరగరాయ్యాలి అన్నా మేమే..వాళ్ళు ఎంత బ్లడ్డీ ఫూల్స్”..”భయమా..నాకా..నా కాంపౌండ్ లో కుక్క కి కూడా ఆ పదం తెలియదు”..గన్స్ ఆర్ మేడ్ విత్ రూల్స్..బట్ నాట్ స్వర్డ్స్..”ఇలా తెలుగు,ఇంగ్లీష్ అని తేడా లేకుండా బాలకృష్ణ నోటి వెంట ఇలాంటి డైలాగ్స్ వస్తుంటే అభిమానుల ఆనందానికి అవదులు లేవు..


ఈ సినిమాల్లో పాటలు గురించి తప్పక చెప్పుకోవాలి..అందులో ” సింహ మటి చిన్నోడే వేటకొచ్చాడే..ఆడివిలాంటి అందాన్నే అక్రమించదే..”పాట బాలయ్య సినిమాలో అల్ టైం హిట్స్ లో నిలిచిపోయింది..”బంగారుకుండా”పాట కూడా అద్భుతంగా ఉంటుంది..ఇతర పాటలు సైతం హిట్ సాధించాయి..చక్రిని ఈ సందర్భంగా తలుచుకోవాల్సిందే…


తెలుగు సినీ అభిమానులు తరపున,ముఖ్యంగా నందమూరి బాలయ్య అభిమానుల తరపున చిత్ర బృందానికి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ..మాస్ బ్లాస్టర్ కాంబో బోయపాటి,బాలయ్య చేస్తున్న మూడవ సీనిమా కొరకు ఎదురు చూద్దాం..