24-01-2022 16:18:43 About Us Contact Us


ప్రొడక్షన్ తో ప్రవేశించి.. డ్యాన్సర్ గా బుల్లితెరతో పరిచయమై.. నటుడిగా వెండితెరపై కనిపించి.. ఇప్పుడు హీరోగా స్థిరపడ్డారు అశ్విన్ బాబు.13 ఏళ్ళ సినీ జీవితంలో ఒకో మెట్టు ఎక్కుతూ.. స్టార్ హీరో దిశగా అడుగులు వేస్తున్న అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కథనం..!


కాకినాడ మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుతున్న ఒక్క కుర్రాడు మిస్టర్.కాకినాడ టైటిల్ గెలిచాడు.టీవీ షో లలో యాంకర్ గా అప్పుడే పరిచయమైన మరో డాక్టర్..అన్నయ్యకు.. తాను ఇలా గెలిచాను.. నాకు సినిమాలో హీరో అవ్వాలని ఉంది.నేను ఫోటోలు పంపుతాను అని చెప్పాడు.మనకు పరిశ్రమలో పెద్దవారు ఎవరు లేరు ముందు చదువుకో అని చెప్పాడు.ఆనాడు అన్నయ్య మాట విని డాక్టర్ కోర్స్ పూర్తి చేసి.. హైదరాబాద్ చేరాడు ఆ తమ్ముడు.అన్నయ్య కూడా యాంకర్ గా సెటిల్ అయ్యి.. జీ లో షో చేసేందుకు నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.దింతో తమ్ముడు కూడా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.ఆ మిస్టర్.కాకినాడ ఎవరో కాదు అశ్విన్..అన్నయ్య ఓంకార్..షో ఆట.. ఇది అశ్విన్ పరిశ్రమలో ప్రవేశానికి నేపథ్యం.


అలా అన్నయ్యకు నిర్మాణ పనుల్లో సహాయపడుతూ కెరీర్ ప్రారంభించారు అశ్విన్.ఎప్పటికైనా తమ్ముడిని హీరో చెయ్యాలి అని అన్నయ్య ఆశ.హీరో అయ్యి.. సి.సి.ఎల్ ఆడాలి అనేది తమ్ముడి కోరిక.ఆట-3 లో కంటెస్టెంట్ గా చేశారు అశ్విన్.డాన్స్ విషయానికి వస్తే..సాక్షాతూ రాజమౌళి గారే డాన్స్ లో అశ్విన్ ని పొగిదారు..అలా 5 ఏళ్ళు నిర్మాణంలో పని చేసిన అశ్విన్ జీనియస్ లో తొలుత హీరోగా అనుకోని.. కొన్ని కారణాల చేత సెకండ్ లీడ్ పాత్ర చేశారు.ఆ తర్వాత వచ్చిన రాజు గారి గది తో భారీ విజయం అందుకున్నారు.హీరోగా తొలి సినిమాలో సెటిల్ గా యాక్టింగ్ చేసిన అశ్విన్ రెండవ సినిమా జతకలిసే సినిమాలో బాయ్ నెక్స్ట్ డోర్ లా కనిపించి అందరిని అలరించారు.అటు విమర్శకుల.. ఇటు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు అశ్విన్.నాన్న..నేను నా బాయ్ ఫ్రెండ్స్.. రాజు గారి గది 2.. రాజు గారి గది 3 లలో హీరోగా చేశారు అశ్విన్.అన్నయ్య వల్లే నేను ఈ స్టేజ్ లో వున్నాను అని నిర్మొహమాటంగా చెప్తూ ఉంటారు అశ్విన్.ఇన్ని సంవత్సరాలు అన్నయ్యతో కష్టపడి.. ఇలా చెప్పడం నిజంగా అశ్విన్ యొక్క మంచి మనసుకి నిదర్శనం.ఒక పక్క హీరోగా చేస్తూ.. అన్నయ్య ఓంకార్.. తమ్ముడు కళ్యాణ్ కు షో ల నిర్మణంలో సహాయ పడుతుంటాడు అశ్విన్.నిర్మాణ రంగంలో ఉండటం వల్ల అందరిని బాగా పలకరించుకుంటారు అని పరిశ్రమలో చెప్తుంటారు.ప్రసృతం ఇస్మార్ట్ జోడి షో కి సహాయపడుతూ.. మరో సినిమాను సైన్ చేశారు అశ్విన్. ప్రి ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ సినిమా కరోనా అనంతరం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.


కష్టాన్ని నమ్ముకొని.. నిర్మాణ రంగంలో తొలి అడుగులు వేసి.. మంచి డ్యాన్సర్ గా నిరూపించుకొని.. నటుడిగా పరిచయమై.. హీరోగా విజయాలు అందుకున్నరు అశ్విన్. ఒక మంచి సినిమాతో పెద్ద హిట్ సాధించాలని.. హీరోగా ప్రేక్షకులలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించి.. స్టార్ హీరోల జాబితాలో చేరాలని కోరుకుంటూ.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అశ్విన్ బాబు కి మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున జన్మదిన శుభాకాంక్షలు..!