24-01-2022 15:20:24 About Us Contact Us2004 ఏప్రిల్ 8న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ గార్లకు లకు తొలి సంతానంగా కొడుకు పుట్టాడు.పవన్ తనకిష్టమైన జపనీస్ దర్శకుడు అకీరా కురోశవా కు గుర్తుగా తన కుమారుడికి అకీరా నందన్ అనే పేరు పెట్టాడు.ఇప్పుడు అకిరా పూణే లో రేణు దేశాయ్ గారి వద్ద చదువుకుంటున్నాడు.6అడుగుల 4అంగుళాల ఎత్తు ఉన్న అకీరా అప్పుడప్పుడు తండ్రితో అలా తల్లుకుమంటుంటాడు.అకీరా ఎత్తు గురించి గతంలోనే సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చే నడిచింది. రేణు,పవన్ లు తమ కొడుకు ఫోటోలు పెద్దగా బయటకు రానివ్వరు.అందుకే సామాజిక మాధ్యమాలలో కూడా పెద్దగా అకీరా ఫోటోలు ఉండవు.


ఇక అకీరా ఏమవ్వాలి అనేది తన ఇష్టం అని,తనకు మంచి విద్యను అందించడం.ఏది తప్పు ఏది ఒప్పు అని తనకు తెలియ చెయ్యడం వరకే నా బాధ్యత.తండ్రి పవర్ స్టార్ కాబట్టి తాను కూడా అదే చిత్ర పరిశ్రమలోకి వెళ్ళాలి అని నేను కానీ తన తండ్రి కానీ తనపై ఒత్తిడి తీసుకురాము.తను పెద్దయ్యాక ఏ రంగంలోకి వెళ్ళాలి అనుకుంటే ఆ రంగంలోకి సరైన మార్గంలో పంపుతాము అని గతంలో రేణు దేశాయ్ గారు అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు.


ఇక జనసేన అధినేత,కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకులు,పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గతంలో అకీరా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడు వారసత్వం తనకు ఇష్టం లేదని,ఏ రంగంలో అయినా వారికి ఆ ట్యాలెంట్ ఉంటే వారంతట వారే పైకి రావాలి.అంటే కానీ,వారసుడు అని చెప్పి తీసుకొచ్చి ప్రజల పై రుద్దటం నాకు ఇష్టం ఉండదు.అలాంటివి నేను చెయ్యను అని,నా వ్యక్తిగతంగా అది చాలా అసహ్యంగా ఉంటుంది అని భావిస్తాను అని చెప్పారు.


ఇలా తల్లితండ్రులు ఇద్దరు అకీరా ఇష్టానికే వదిలేశారు,అయితే రేణు దేశాయ్ దర్శకత్వం 2014లో వచ్చిన “ఇష్క్ వాలా లవ్” అనే మరాఠీ సినిమాలో అకీరా ఒక పాత్ర లో కాసేపు కనిపించాడు. శ్రీ ఆద్య ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా రేణు దేశాయ్ స్వయంగా నిర్మించారు.ఆ సినిమా తర్వాతి రోజుల్లో తెలుగులో డబ్ అయింది.అయితే కేవలం ఒక చిన్న స్కీన్ లో ఒక పిల్లవాడు కావాలి,నా కొడుకు ఉంటే బాగుంటుంది అని తల్లిగా నేను భావించి పెట్టుకున్నాను అంటే అని ఆమె చెప్పారు.ఆయినా,నాటి నుండి పవన్ అభిమానులు అన్న కొడుకు వస్తున్నాడు,జూనియర్ పవర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చారు.


తాను ఏమవ్వాలి అనే స్పష్టత ఆ కుర్రాడికి కూడా వచ్చివుండదు,ఇంకా చదువు కూడా పూర్తికాలేదు.ఇదంతా ఇప్పుడేందుకంటే నిన్న 16వ పుట్టినరోజు జరుపుకున్నాడు అకీరా.మొన్న సాయంత్రం 6 గంటల నుండి సామాజిక మాధ్యమాలలో అకిరా పేరు మారు మోగిపోయిండి. నిన్న ఒక్క రోజే తెలుగు చిత్ర పరిశ్రమలో ముగ్గురు సెలబ్రిటీస్ పుట్టినరోజులు ఉన్నాయి.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అఖిల్ అక్కినేని,సౌత్ ఇండియన్ హీరోయిన్ నిత్యా మినన్.అలా ఇంతమందివి ఒకే రోజు ఉంది కూడా అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షల హాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.ఎంతలా అంటే మధ్యలో కొద్దిసేపు పాటు అల్లు అర్జున్ కి విషెస్ కంటే అకీరావే ఎక్కువ పడ్డాయి.24 గంటల్లో అకీరా కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హాష్ ట్యాగ్ తో వేసిన ట్వీట్స్ సంఖ్య అక్షరాల 1.1మిలియన్(11లక్షలు).సామాజిక మాధ్యమాలను విశ్లేషించే సైట్ ప్రకారం దాదాపు 158.8 మిలియన్ మందికి రీచ్ అయ్యిందట.తెలుగులో ఉన్న స్టార్ హీరోల వారసుల పుట్టిన రోజు ట్యాగ్ లలో తొలి స్థానంలో నిలిచింది,ఈ ట్యాగ్.మరో పక్క మెగాస్టార్ చిరంజీవి గారు,నాగబాబు గారు,రామ్ చరణ్,సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్, ఇలా మెగా ఫామిలీ హీరోల నుండి పవన్ అభిమానులుగా చెప్పుకునే సినీ సెలబ్రిటీస్ నీలిమ తిరుమలశెట్టి,బండ్ల గణేష్ ఇలా అనేక మంది అకిరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచెయ్యడంతో అకీరా తన తండ్రిలాగా ట్రెండ్ సెట్ చేశాడు. సినిమాలు చేస్తాడో లేదో తెలియదు,కనీసం ఇష్టం ఉందో,లేదో కూడా తెలియదు..!కానీ పవన్ అభిమానులు మాత్రం అకీరా జూనియర్ పవర్ స్టార్ గా,తమ అన్న కొడుకుగా ప్రేమను పంచడం మొదలుపెట్టేశారు.


సిసింద్రీ సినిమా,తెలుగు సినీ క్రికెట్ లీగ్,మనంలో గెస్ట్ రొల్ చెయ్యడంతో హీరోగా సినిమా చెయ్యకముందే అఖిల్ అక్కినేనికి ఒక క్రేజ్ ఏర్పడింది.కానీ ఇప్పుడు అకీరా క్రేజ్ చూస్తుంటే అసలు అకీరా సినిమాలు చెయ్యకున్నా కేవలం తన ఫోటోలతో మరో దశాబ్దం పాటు ఇదే క్రేజ్ తో కొనసాగేలా వున్నాడు.మరి 16వ ఏట అడుగుపెట్టిన అకీరా రానున్న రోజుల్లో ఏ మార్గంలో అడుగులు వేస్తాడో చూడాలి.రంగం ఏదైనా అకీరా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని కోరుకుందాం..!