17-05-2022 04:12:04 About Us Contact Usసినీమాభిమానులకు వరసగా మెగా సోదరులు శుభవార్తలు అందిస్తూ.. అందరిని ఆనందింపచేస్తున్నారు.ఈ సంవత్సరం మార్చ్ రెండవ వారం నుండి సినిమా హాల్స్ ముయ్యడం.. అదే నెల చివరి వారం నుండి షూటింగ్స్ ఆగిపోవడంతో పెద్దగా సినిమా వార్తలు లేవు.అలాంటిది వారం రోజుల వ్యవధిలో మెగా బ్రదర్స్ సెట్స్ పైకి వెళ్తున్నట్లు ప్రకటించి కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు.


ఇప్పటికే మెగా హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుప్రీమ్ హీరో ధరమ్ తేజ్.. వైష్ణవ్ తేజ్.. కళ్యాణ్ దేవ్ లు షూటింగ్స్ ప్రారంభించారు.వైష్ణవ్ తేజ్ ఏకంగా కొత్త సినిమాని ప్రారంభించి ఒక్క షెడ్యూల్ లో సినిమా పూర్తి చేశారు.. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం ముగిసింది.ఇలా మెగాహీరోలు సెట్స్ లోకి వెళ్తుంటే మేము ఏమి తక్కువ కాదు అంటూ చిత్రీకరణకు సై అన్నారు మెగా బ్రదర్స్.


ఇప్పటికే తన సినీ కరీర్ లో ఎప్పుడు లేని విధంగా వరస సినిమాలు సైన్ చేస్తూ పవర్ స్టార్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.జూన్ మొదటి వారంలో చాతుర్మాస దీక్ష ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారు దసరా రోజుల్లో దీక్ష ముగించారు.దింతో వెంటనే మిగిలిన వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసేందుకు సెట్స్ పైకి వచ్చేశారు.ఇప్పటికే విడుదలైన ఫొటోలలో పవన్ కళ్యాణ్ చాలా బాగా కనిపిస్తున్నారు.దింతో అభిమానుల సంబరాలకు అవధులు లేకుండా పోయాయి.అంతేనా మరో పక్క సంక్రాంతి బరిలోకి వకీల్ సాబ్ అనే వార్త కూడా తిరుగుతుంది.ఇప్పటికి అధికారిక ప్రకటన రాలేదు కానీ,సామాజిక మాధ్యమాలలో ప్రచారం మాత్రం బలంగా జరుగుతుంది.మరో పక్క మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ప్రకటన విడుదల చేశారు.ఈ నెల(నవంబర్) 9 నుంచి ఆచార్య షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. భారీ షెడ్యూల్ లో మెగాస్టార్ పాలుగోనున్నట్లు.. దింతో ఆచార్య సింహ భాగం షూటింగ్ పూర్తవుతుందని.. 2021 వేసవికి సినిమా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ ప్రకటన సారాంశం.


వీటితో పాటు.. మొన్ననే కరోనా నుండి కోలుకుని.. ప్లాస్మా దానం చేసి పుట్టినరోజు జరుపుకున్న టవర్ స్టార్ నాగబాబు గారు తాను కూడా శుభవార్త చెప్పాలనుకున్నట్లు ఉన్నారు.ఇప్పటికే నిర్చిదార్థం చేసిన కూతురు నిహారిక పెళ్ళి తేదీని ప్రకటించారు.డిసెంబర్ 9న రాజస్థాన్ లో పెళ్ళి చేయన్నునట్లు తెలపడంతో మెగాభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇలా మెగా బ్రదర్స్ వార్తలతో సినిమాభిమానులకు కొత్త జోష్ వచ్చింది.అలానే.. మెగాస్టార్ సైతం సెట్స్ పైకి వస్తుండటంతో మిగతా హీరోలు సైతం షూటింగ్స్ ప్రారంభించేందుకు ముందుకు రావడం తధ్యం.


త్వరలో అటు సినిమా షూటింగ్స్ అన్ని ప్రారంభం అవ్వాలని.. అలానే సినిమా హాల్స్ సైతం తేర్చుకోవాలని.. చిత్రపరిశ్రమ మళ్ళీ పునర్వైభవం పొందాలని కోరుకుందాం..!